
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఓమీ అనే సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఓమీ సాంగ్‌లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.
తాజాగా ఈ చిత్రం నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే పాటను విడుదల చేశారు. అద్వితీయ, హర్ష రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.