మాస్‌ డ్యాన్స్‌? | Mana Shankara Vara Prasad Garu begins song shoot | Sakshi
Sakshi News home page

మాస్‌ డ్యాన్స్‌?

Sep 8 2025 12:10 AM | Updated on Sep 8 2025 12:10 AM

Mana Shankara Vara Prasad Garu begins song shoot

మాస్‌ డ్యాన్స్‌ చేస్తారా? రొమాంటిక్‌ సాంగ్‌  పాడుకుంటారా? ఇంతకీ చిరంజీవి–నయనతార ఏ తరహా పాట చేయనున్నారు? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఈ ఇద్దరూ పాల్గొనగా ఒక పాట చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తోంది ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ యూనిట్‌. చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్‌గా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.

ఇటీవల ఆరంభమైన ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార, ఇతర ముఖ్య తారలు పాల్గొనగా టాకీ పార్ట్‌ షూట్‌ చేశారు. నేటి నుంచి చిరంజీవి, నయనతార పాల్గొనగా హైదరాబాద్‌లో ఒక పాట చిత్రీకరించనున్నట్లు యూనిట్‌ పేర్కొంది. ‘‘భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ రూపొందించారు.

చిరంజీవి–నయనతారపై చిత్రీకరించే పాటకు డ్యాన్స్‌ మాస్టర్‌ విజయ్‌  పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు’’ అని యూనిట్‌ తెలియజేసింది. అయితే... ఇది మాస్‌ నంబరా? రొమాంటిక్‌ సాంగా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement