
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ పుట్టినరోజున కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. దీంతో పాటు గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఓమి అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మీ కనిపించారు.
ఈ పాటకు అద్వితీయ లిరిక్స్ అందిచంగా.. శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక, అద్వితీయ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.