
మంగ్లీ పేరు చెప్పగానే తెలంగాణ ఫోక్ సాంగ్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి. పల్లె గీతాలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. గత కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల్లోనూ అడపాదడపా కమర్షియల్ పాటలు పాడుతూనే ఉంది. అయితే మంగ్లీ అంటే ఒకేలాంటి పాటలు పాడుతుంది అనే అభిప్రాయం చాలామందికి ఉంది. అలాంటిది ఇప్పుడు ఓ డిఫరెంట్ సాంగ్‌తో వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని స్తూతిస్తూ ఈ పాట పాడింది.
(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్)
కర్ణాటిక్ మ్యూజిక్ కూడా గతంలోనే నేర్చుకున్న మంగ్లీ.. ఇప్పుడు వినాయకుడి గీతాన్ని ఆ జానర్‌లోనే పాడింది. 'శ్రీ గణపతిని' అంటూ సాగే ఈ గీతం రెండు రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేసింది. రెస్పాన్స్ కూడా బాగానే వస్తోంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)