
రీసెంట్‌గా 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా రిలీజైంది. పాజిటిక్ టాక్ వచ్చినా సరే దీన్ని జనాలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స.. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు గతంలో తీసిన మరో మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
(ఇదీ చదవండి: 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి)
డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్' కంటే ముందు 'కరణ్ అర్జున్' అనే సినిమా తీశాడు. 2022 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో థియేటర్లలో పెద్దగా ఫెర్మార్మ్ చేయలేదు. జనాలు ఆ చిత్రం గురించి మర్చిపోయారు. అలాంటిది దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
'కరణ్ అర్జున్' విషయానికొస్తే.. కరణ్ (నిఖిల్ కుమార్) తనకు కాబోయే భార్య వృషాలి(షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్‌లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు? చివరకు ఏమైందనేదే మిగతా సినిమా.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే)