
మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో SSMB29 ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ కెన్యాలో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని చిత్ర యూనిట్ కలిసింది. ఇదే విషయాన్ని అక్కడి మంత్రి సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
కెన్యా మంత్రి ఇలా చెప్పారు. ' ప్రపంచంలోని గొప్ప దర్శకులు రాజమౌళి. ఆయన రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు ఖండాంతర ప్రేక్షకులను కూడా ఆకర్షించాయి. అతను దార్శనిక భారతీయ దర్శకుడు. 120 మందితో కూడిన రాజమౌలి టీమ్ తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి ఫైనల్‌గా తమ సినిమా కోసం కెన్యాను ఎంచుకుంది. దాదాపు 95% ఆఫ్రికన్ దృశ్యాలను చిత్రీకరించే ప్రాథమిక గమ్యస్థానంగా మన దేశాన్ని నిర్ణయించింది.

ఇక్కడ ఉండే మసాయి మరా మైదానాల నుంచి సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు అతిపెద్ద చలనచిత్రంలో భాగం కాబోతున్నాయి. 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రపంచ వేదికలపై మా దేశ అందాలు, ఆతిథ్యం, అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. SSMB29 సినిమా ద్వారా కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకునేందుకు రెడీగా ఉంది.' అని అక్కడి మంత్రి ముసాలియా ముదావాది తెలిపారు.
మహేశ్‌బాబు ఇప్పటికే ఆఫ్రికాలో ఉన్నారు. సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భార్య నమ్రత వినాయక చవితి పండగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి, మహేశ్‌బాబును మిస్ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుపై ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామి కానుందనే ప్రచారం జరుగుతోంది.
Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents.
Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025