
‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి రామ్‌చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలోని మరొక లుక్ కోసం రామ్‌చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.
టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అలీం హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, రామ్‌చరణ్‌ను సరికొత్త లుక్‌లో ప్రజెంట్ చేయనున్నారు. ‘‘ఈ లుక్‌లో రామ్‌చరణ్ స్టైల్, స్వాగ్ వినూత్నంగా, ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.