
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. అంతకుముందే కుబేర మూవీతో హిట్ కొట్టిన నాగ్.. కూలీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ మూవీ తర్వాత నాగార్జున చేయబోయే ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమా ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలవనుంది. తన రాబోయే చిత్రం నాగార్జున వందో చిత్రంగా కానుంది. ఈ ప్రత్యేక మూవీకి సంబంధించిన కింగ్ నాగ్ హింట్ ఇచ్చేశాడు. తాజాగా జగపతిబాబు టాక్ షోకు హాజరైన డైరెక్టర్ పేరును కూడా రివీల్ చేశాడు. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.
తన వందో సినిమాపై దాదాపు ఆరేడు నెలలుగా వర్క్ జరుగుతోందని టాక్ షోలో నాగార్జున తెలిపారు. ఏడాది క్రితమే డైరెక్టర్ రా కార్తీక్ తనకు కథ చెప్పారని అన్నారు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది.. కూలీ రిలీజ్ కాగానే మొదలు పెడదామని చెప్పానని తెలిపారు. యాక్షన్తో పాటు ఫ్యామిలీ డ్రామాగా ఉండనుందని కింగ్ నాగార్జున పంచుకున్నారు. ఈ సినిమాలో నేనే లీడ్ రోల్ చేస్తున్నానని వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు కింగ్ 100 నాటౌట్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా.. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఇప్పటికే ఆకాశం, నితమ్ ఓరువానం లాంటి చిత్రాలను తెరకెక్కించారు.
"#Nagarjuna100 film will be with Ra.Karthik (NithamOruVaanam) who is Tamil Director🤝. It's a very grand film, we are starting this film now, as #Coolie released💥. It's a nice action, Family, Drama film & I'm the protagonist in that😂"
- #Nagarjuna pic.twitter.com/Jz0k9EwXQr— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2025