Carmeni Selvam Movie
-
‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘కార్మేని సెల్వం’నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్నిర్మాణ సంస్థ: పాత్వే ప్రొడక్షన్స్నిర్మాత:అరుణ్ రంగరాజులుదర్శకుడు: రామ్ చక్రిసంగీత దర్శకుడు: ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)సినిమాటోగ్రఫీ: యువరాజ్ దక్షణ్ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్విడుదల తేది: ఏప్రిల్ 3, 2026దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్(గౌతమ్ మీనన్) దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్‌తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా రియలిస్టిక్ ఇందులో చూపించారు. అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి. కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్ మొత్తం మిడిల్ క్లాస్ కష్టాలను, సెకండాఫ్‌లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్‌కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్ అయిపోతారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్ మొత్తం మరింత ఎమోషనల్‌గా సాగుతుంది. జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.రేటింగ్: 2.75/5 -
అప్పులతో బాధపడుతున్న వారికి ధైర్యం ఇచ్చే సినిమా ఇది
విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కార్మేని సెల్వం’. రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..‘‘నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ఆనంద్, గోదావరి మూవీస్ చూశా. అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల గారి ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను శేఖర్ కమ్ముల గారితో నేరుగా పని చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ, ఆయనను నా గురువు, మెంటర్‌గా భావిస్తాను. ఆయన సినిమాలను చూస్తూ ఎంతో నేర్చుకున్నాను. అలాగే నా దర్శక గురువు కె.వి. గుహన్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఈ ఇద్దరూ నాకు ఇన్స్పిరేషన్గా నిలిచారు.ఇక ‘కార్మేని సెల్వం’ విషయానికొస్తే.. ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై ఆధారపడి ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా మూవీ ఉంటుంది. సముద్రఖని ఆయన పాత్రలోని ప్రతి షేడ్‌ను అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్ గారు, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది.మ్యూజిక్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం . ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు. సంగీతం అనేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్స్‌దే కాదు.. ఇన్‌స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు, మిక్సింగ్ టీమ్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్లు కలిసి చేసే పనిగా వారు భావించారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి పాటకు పని చేసిన అందరికీ క్రెడిట్ ఇవ్వడం, అలాగే రెవెన్యూ షేర్ చేయడం మా లక్ష్యం. ఇది మ్యూజిక్ వెనుక ఉన్న అసలు హీరోలకు గుర్తింపు ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం. మా డీఓపీ యువరాజ్ దక్షణ్, ఎడిటర్ జగన్‌లకు ఎంతో అనుభవం ఉంది. థియేటర్లో ఈ సినిమా విజువల్స్ చూస్తే, కథను ఎంత గ్రాండ్‌గా తీసుకెళ్లామో అర్థమవుతుంది. ఇక మా ప్రొడ్యూసర్ అరుణ్ రంగరాజులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’’. -
సంగీత రంగంలో కొత్త ప్రభంజనం 'కార్మేని సెల్వం'
అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వం వహించిన ద్విభాషా సినిమా 'కార్మేని సెల్వం'. సముద్రఖని, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో రామానుజన్ ఎంకే ఈ మూవీకి సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన 'అరెరె' పాట ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా థియేటర్లలోకి రానున్న సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలని పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)సినిమాకు సంగీతమందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా, ఓ సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో 'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. ప్రస్తుతం 'కార్మేని సెల్వం' ప్రాజెక్టు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.ఇందులో భాగంగా సౌండ్ ఇంజనీర్లు, వాయిద్య కారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేం సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాం. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. తెలుగులో హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. కార్మేని సెల్వం.. హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్
సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ స్టోరీగా ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.


