'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్ | Samuthirakani Carmeni Selvam Telugu Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

Carmeni Selvam Telugu Trailer: 'అప్పు చేస్తేనే పెద్ద వాళ్లమవుతాం'.. ఆసక్తిగా కార్మేని సెల్వం ట్రైలర్

Mar 26 2026 7:15 PM | Updated on Mar 26 2026 7:28 PM

Samuthirakani Carmeni Selvam Telugu Movie Trailer Out Now

సముద్రఖని, అభినయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ కార్మేని సెల్వం. ఈ ద్విభాషా చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ మూవీని పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మించారు.  ఈ చిత్రంలో డైరెక్టర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్‌  హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సామాన్యుడి ఇంటికల, ఆర్థిక సమస్యలు, డబ్బు అనే కోణంలో ఈ కథను రూపొందించారని ట్రైలర్‌లో అర్థమవుతోంది. అప్పులు అనే కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్‌ స్టోరీగా ట్రైలర్‌లో చూపించారు. కాగా.. ఈ చిత్రంలో లక్ష్మీ ప్రియ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement