సంగీత రంగంలో కొత్త ప్రభంజనం 'కార్మేని సెల్వం' | Carmeni Selvam Movie Music Director Comments | Sakshi
Sakshi News home page

సంగీత రంగంలో కొత్త ప్రభంజనం 'కార్మేని సెల్వం'

Mar 30 2026 5:31 PM | Updated on Mar 30 2026 6:02 PM

Carmeni Selvam Movie Music Director Comments

అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వం వహించిన ద్విభాషా సినిమా 'కార్మేని సెల్వం'. సముద్రఖని, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 3న  తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో  రామానుజన్ ఎంకే ఈ మూవీకి సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన 'అరెరె' పాట ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా థియేటర్లలోకి రానున్న సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలని పంచుకున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

సినిమాకు సంగీతమందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా, ఓ సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే   2017లో బెంగళూరులో  'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. ప్రస్తుతం 'కార్మేని సెల్వం' ప్రాజెక్టు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను  ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.

ఇందులో భాగంగా సౌండ్ ఇంజనీర్లు, వాయిద్య కారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేం సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాం. సినీ  సంగీత రంగంలో ఇదొక  కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. తెలుగులో హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. కార్మేని సెల్వం.. హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement