నన్ను తిడుతూ.. సినిమా మధ్యలోనే వెళ్లిపోతారు! | Gunasekhar Interesting Comments at Euphoria Trailer Launch Event | Sakshi
Sakshi News home page

Gunasekhar: నన్ను తిడుతూ అరుస్తారు.. సినిమా బాయ్‌కాట్‌ చేస్తారు!

Jan 18 2026 2:17 PM | Updated on Jan 18 2026 2:59 PM

Gunasekhar Interesting Comments at Euphoria Trailer Launch Event

భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, సారా అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం యుఫోరియా. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా (జనవరి 17న) యుఫోరియా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బోల్డ్‌గా తీశా..
ఆయన మాట్లాడుతూ.. కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమా తీయడానికి నేనెప్పుడూ వెనుకాడలేదు. యుఫోరియా నన్ను బాగా ఇన్‌స్పైర్‌ చేసిన కథ. ఇందులో మూడు ప్రధానాంశాలున్నాయి. అడాలసెన్స్‌, పేరెంటింగ్‌, సోషల్‌ ఇంపాక్ట్‌.. ఈ మూడే కథకు కీలకమైనవి. కథను ఎంత స్ట్రాంగ్‌గా అనుకున్నానో అంతే బోల్డ్‌గా తీశాను. 

ఆ ప్రమాదం ఉంది!
కొన్ని సన్నివేశాల్లో నన్ను తిడుతూ అరుస్తారు కూడా! కొందరైతే సినిమా మధ్యలో నుంచే బాయ్‌కాట్‌ చేసి వెళ్లే ప్రమాదముంది. యూత్‌ ఎంతకు దిగజారిపోతున్నారు? సమాజం ఎలా తయారైంది? అన్నది చెప్పాను. మద్యలో కొందరు కోపంతో వెళ్లిపోదామనిపించినా చివరకు ఈ కథ ఇలాగే చెప్పాలి అనుకుంటారు అని చెప్పుకొచ్చాడు.

 

చదవండి: కూతురికి అమ్మవారి పేరు పెట్టిన బాలీవుడ్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement