భూమిక కనువిప్పు కలిగించింది: గుణశేఖర్‌ | Euphoria Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

భూమిక కనువిప్పు కలిగించింది: గుణశేఖర్‌

Jan 18 2026 5:23 AM | Updated on Jan 18 2026 5:23 AM

Euphoria Movie Trailer Launch Event

పృథ్వీ, భూమిక, సారా అర్జున్, గుణశేఖర్, యుక్త గుణ

‘‘చిత్ర పరిశ్రమలో 2026 నవ్వులతోప్రారంభమైంది. అందుకే ఫిబ్రవరి 6న ఒక స్పెషల్‌ మూమెంట్‌ కోసం మా ‘యుఫోరియా’ సినిమాను తీసుకొస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ఇది’’ అని డైరెక్టర్‌ గుణశేఖర్‌ తెలిపారు. భూమిక చావ్లా, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచలి తదితరులు కీలక పాత్రలుపోషించిన చిత్రం ‘యుఫోరియా’. గుణశేఖర్‌ దర్శకత్వంలో రాగిణి గుణ సమర్పణలో గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిల్మ్స్‌  బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

 హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో గుణశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి నీలిమ ఎప్పుడూ ఇంత ఎమోషన్‌ అవదు. కానీ, ఈ ట్రైలర్‌ చూసి ఎమోషనల్‌ కావడానికి కారణం ‘యుఫోరియా’ కథ అంతగా ప్రభావితం చేయడమే. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్‌ అయింది. కేవలం గ్లామర్‌ పాత్రలే చేస్తామని చెప్పే హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్‌ మీనన్‌గారి పాత్ర సహజంగా ఉంటుంది. మా మూవీకి చక్కని సంగీతం అందించిన కాలభైరవ... తండ్రి (కీరవాణి)ని మించిన తనయుడు అనిపించుకున్నాడు’’ అని చెప్పారు.

నీలిమ గుణ మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌ చూశాక చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇంత ఇంపాక్ట్‌ ఉన్న సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. భూమిక మాట్లాడుతూ– ‘‘యుఫోరియా’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పిల్లలను ఎలా పెంచాలి అనేది అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘గుణశేఖర్‌గారితో పని చేయడం గౌరవంగా ఉంది. ‘యుఫోరియా’ తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుంది’’ అని సారా అర్జున్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  నటులు అడ్డాల పృథ్వీరాజ్, విఘ్నేష్‌ గవిరెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement