హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి వచ్చిన తెలుగమ్మాయి వితికా షేరు.. తనతో పాటు కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్‌ని తర్వాత కొన్నాళ్లకు పెళ్లిచేసుకుంది. మధ్యలో వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్లో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే ఈ షో నుంచి వచ్చిన తర్వాత వరుణ్ సందేశ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు గానీ వితిక మాత్రం యూట్యూబ్‍లో వీడియోలు చేస్తోంది.
ఎప్పటికప్పుడు తన జీవితంలో జరిగే విశేషాలని పంచుకునే వితికా షేరు.. తన చెల్లి క్రితిక సీమంతం చేసిన విషయాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో ఫొటోలు, యూట్యూబ్‌లో ఈ శుభకార్యానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో వితిక కుటుంబంతో పాటు క్రితిక అత్తగారి కుటుంబం కూడా ఆనందంగా కనిపించారు.
(ఇదీ చదవండి: ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్ చేసిన సాయికిరణ్)
'సీమంతం అనేది మహిళ జీవితంలో ఓ అందమైన సంప్రదాయ వేడుక. ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు. అమ్మతనం, ప్రేమ అనే కొత్త ప్రారంభానికి ఇదో సెలబ్రేషన్' అని వితిక తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇకపోతే నెలన్నర క్రితం అంటే సెప్టెంబరు చివరి వారంలోనూ చెల్లికి సింపుల్‌గా బేబీ షవర్ (సీమంతం) చేసింది. అప్పుడు కేవలం స్నేహితురాళ్లతో దీన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఇప్పుడు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకని జరుపుకొన్నారు.
చెల్లి కృతికని చంటిపాపలా చూసుకునే వితికా షేరు.. చెల్లి పెళ్లిని తన చేతుల మీదుగానే చేసింది. 2022లో కృతిక, కృష్ణ అనే వ్యక్తిని వివాహమాడింది. కొన్ని నెలల క్రితమే కృతిక.. తాను తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇప్పుడు సీమంతం జరిగింది.
(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)






