బుల్లితెర జంట సాయికిరణ్ (Sai Kiran)- స్రవంతి త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్నారు. ఈ క్రమంలో గర్భిణి అయిన స్రవంతికి ఘనంగా సీమంతం జరిపారు. పట్టుచీర కట్టుకుని, నగలతో సింగారించుకుని స్టేజీపై కూర్చున్న శ్రీమతి చేతికి గాజులు తొడుగుతూ భార్యను మనసారా ఆశీర్వదించాడు సాయికిరణ్. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కోయిలమ్మ జంట
అందులో ఈ ఫంక్షన్‌కు వచ్చిన బంధుమిత్రులు, అతిథులు తనకు చీరవంటి కానుకలను సమర్పించారు. సాయికిరణ్- స్రవంతి కోయిలమ్మ సీరియల్‌లో నటించారు. కాగా సాయికిరణ్‌కు 2010లోనే వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లవగా ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. వీరిద్దరూ కొన్నేళ్ల క్రితమే విడిపోగా నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు.
పేరెంట్స్ సింగర్.. తానేమో నటుడిగా..
ప్రముఖ సింగర్ పి.సుశీలకు మనవడు వరసవుతాడు సాయికిరణ్. ఈయన తండ్రి రామకృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోలకు పాటలు పాడారు. తల్లి జ్యోతి కూడా మంచి సింగరే! సాయికిరణ్ మాత్రం సింగర్‌గా కాకుండా నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. నువ్వే కావాలి సినిమాతో సెకండ్ హీరోగా పరిచయమయ్యాడు. ప్రేమించు మూవీలో కథానాయకుడిగా మెప్పించాడు. అయితే ఎక్కువ కాలం హీరోగా కొనసాగలేకపోయాడు.
సినిమా
మనసుంటే చాలు, ఆడంతే అదో టైప్, జగపతి, గోపి-గోడమీద పిల్లి, ఆయుధ పోరాటం, జగద్గురు ఆది శంకర, షిరిడీ సాయి, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ. బింబిసార వంటి పలు చిత్రాల్లో నటించాడు. సీరియల్స్‌లో విష్ణువు, సూర్యభగవానుడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి పాత్రల్లో యాక్ట్ చేశాడు. మౌనరాగం, గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యారాగం సీరియల్స్‌తో బుల్లితెరపైనా సెన్సేషన్ అయ్యాడు.
చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!


