
ఈసారి షాకింగ్ ఎలిమినేషన్. గత వారం ప్రియ బయటకెళ్లిపోయింది. కానీ ఆమెతో పాటు చివరవరకు డేంజర్ జోన్‌లో ఉన్న కల్యాణ్ లిస్టులో లేడు. దీంతో ప్రియ దోస్త్ శ్రీజ.. ఈసారి ఎలిమినేట్ కావడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్స్ వల్ల ఈ వారం చాలా లెక్కలు మారిపోయాయి. అయినా సరే మరో కామనర్ ఎలిమినేట్ అయిపోయాడు. అతడే మాస్క్ మ్యాన్ హరీశ్. ఇంతకీ అసలేమైంది?
అగ్నిపరీక్ష పోటీలో మంచి ప్రదర్శన ఇచ్చిన హరీశ్.. హౌసులోకి అడుగుపెట్టాడు. అయితే వచ్చినప్పటి నుంచి నాకు నచ్చినట్లు నేనుంటాను. పక్కనోళ్లు కూడ నాకు నచ్చినట్లుగానే ఉండాలని అనుకునేవాడు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నోరుజారడం, వాటి గురించి హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం కామన్ అయిపోయింది. కానీ ఈ వారం మాత్రం ఆరోగ్య సమస్యల వల్ల గేమ్స్ ఆడలేకపోయాడు. దీంతో ఓటింగ్ అంతా డ్రాప్ అయిపోయినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'ఓజీ' నుంచి నేహా శెట్టి సాంగ్ రిలీజ్)
ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. సంజన, రీతూ, శ్రీజ, ఫ్లోరా, దివ్య, హరీశ్. వీళ్లలో సంజన, రీతూ, ఫ్లోరా.. తొలి వారం నుంచి అడపాదడపా నామినేషన్లలో ఉంటూ వచ్చారు. దీంతో వాళ్లకు ఓటు బ్యాంక్ బాగానే ఏర్పడింది. అలా ఈసారి కూడా ఓటింగ్ బాగానే పడింది. దివ్య కూడా వచ్చి వారమే అవుతుండటం, హౌసులో హుందాగా ప్రవర్తిస్తుండటం ఈమెకు ప్లస్ అవుతోంది. అది ఓట్ల రూపంలో మారుతోంది. చివరగా ఈసారి శ్రీజ కూడా కల్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీంతో ఈమెకు కూడా ఓట్లు బాగానే పడ్డాయి. అమ్మాయిలందరూ ఆకట్టుకుంటే హరీశ్ మాత్రం ఆరోగ్య సమస్యలతో గేమ్స్ ఆడలేకపోయారు. అలా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య సమస్యనే మెయిన్ అయినప్పటికీ హరీశ్‌పై హౌసులోనూ నెగిటివిటీ బాగానే ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా శనివారానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఫ్లోరా-హరీశ్ ఫొటోల్లో ఒకరిది ఎంచుకుని ట్రాష్ చేయాలని నాగార్జున అడిగేసరికి చాలామంది హౌస్‌మేట్స్ హరీశ్ పేరు చెప్పారు. అలా ఈసారి హౌస్ నుంచి మాస్క్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేసేశారట. అనధికారికంగా ఈ విషయం బయటకొచ్చింది. ఆదివారం ఎపిసోడ్‌తో హరీశ్ ఎలిమినేషన్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి)