
అనుకున్నదే జరిగినట్లు కనిపిస్తుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ప్రస్తుతం ఐదో వారం నడుస్తోంది. గత నాలుగు వారాల్లో శ్రష్ఠి వర్మ, మనీష్, ప్రియ, హరీశ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరవుతారోనని అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఈసారి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. వీళ్లలో ఇప్పుడు ఇద్దరు బయటకెళ్లిపోయారట.
బిగ్‌బాస్ నుంచి ఈ వారం.. తొలి వికెట్‌గా ఫ్లోరా బయటకెళ్లిపోయినట్లు ఖరారైపోయింది. లెక్క ప్రకారం తొలి రెండు వారాల్లోనే ఈమె ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే పెద్దగా యాక్టివ్‌గా ఉండదు, నామినేట్ చేసినా సరే పెద్దగా వాదులాడటం లాంటివి చేయకుండా సరే సరే అని అనడం, గత కొన్నిరోజుల నుంచి అయితే సంజనకు సేవకురాలిగా ఉండటం తప్పితే పెద్దగా చేసినట్లు కనిపించలేదు. దీంతో ఈ వారం ఫ్లోరాని బిగ్‌బాస్ బయటకు పంపేశాడు.
(ఇదీ చదవండి: ప్రధాని మోదీని కలిసిన చరణ్-ఉపాసన.. కారణం ఏంటంటే?)
ప్రతి సీజన్‌లోనూ ఐదో వారం దాదాపుగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుంది. ఈసారి కూడా ఆరుగురు రాబోతున్నారు. దీంతో డబుల్ ఎలిమినేషన్ ఉండటం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఫ్లోరాతో పాటు నామినేట్ అయిన వాళ్లలో ఎవరి వికెట్ పడుతుందా అనుకున్నారు. డేంజర్ జోన్‌లో అయితే శ్రీజ, దివ్య, రీతూ, పవన్, సుమన్ శెట్టి ఉన్నట్లు తెలిసింది. వీళ్లలో నుంచి ఇప్పుడు శ్రీజని కూడా బయటకు పంపేశారట. అయితే ఈ ఎలిమినేషన్ కాస్త విచిత్రంగా సాగింది.
మామూలుగా అయితే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే పంపిస్తుంటారు. కానీ శ్రీజని మాత్రం.. హౌస్‌లోకి రాబోతున్న వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ముకుమ్మడిగా బయటకు పంపేశారట. డేంజర్ జోన్‌లో ఉన్నవాళ్లలో ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలని అడగ్గా.. ఎక్కువమంది శ్రీజ పేరు చెప్పారట. దీంతో ఈమెని డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు పంపేశారని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్స్‌తో పాటు వైల్డ్ కార్డ్స్ ఎవరనేది కూడా క్లారిటీ రానుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే)