గిరిబాబు అంత్యక్రియలు పూర్తి.. భారీగా హాజరైన అభిమానులు | Tollywood actoe Giribabu Last Rites Completed at Ravinuthala Village | Sakshi
Sakshi News home page

Giribabu: స్వగ్రామంలో గిరిబాబు అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అభిమానులు

Nov 15 2026 5:45 PM | Updated on Nov 15 2026 5:52 PM

Tollywood actoe Giribabu Last Rites Completed at Ravinuthala Village

టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం రావినూతలలో అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్దఎత్తున హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 

గిరిబాబు అసలు పేరు యెర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటిస్తూ తనలోని కళాకారుడిని గుర్తించారు. సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లారు. 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఏకంగా 600లకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన  చివరిగా తెలుగులో ‘అన్ని మంచి శకునములే’(2023)లో న్యాయమూర్తి పాత్రలోలో నటించారు. 

తన కెరీర్‌లో సుమారు 600 చిత్రాల  దాదాపు 100 సినిమాల్లో హీరోగా, 300 చిత్రాల్లో విలన్‌గా, మిగతా చిత్రాల్లో హాస్య, సహాయ, క్యారెక్టర్‌ పాత్రల్లో నటించారు. పౌరాణికాలు, జానపదాలు, కౌబాయ్‌ సినిమాలు మొదలుకుని కుటుంబ కథా చిత్రాలు, కామెడీ, యాక్షన్‌ చిత్రాల వరకు అనేక జానర్లలో నటించారు. విలన్‌గా ఆయన తెరపై చూపించిన ప్రతినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే సమయంలో కామెడీ, కుటుంబ కథా చిత్రాల్లో సున్నితమైన పాత్రలు కూడా చేశారు. అందుకే ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా దశాబ్దాల పాటు అవకాశాలు అందుకున్న నటుడిగా గిరిబాబు నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement