బిగ్‌బాస్ 10: కొత్త కెప్టెన్ నరేశ్.. వర్షిణికి పనిష్మెంట్ | Bigg Boss 10 Telugu Day 69 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Day 69: ముకేశ్‌తో వర్షిణి తల్లి ముచ్చట్లు

Nov 15 2026 10:36 AM | Updated on Nov 15 2026 11:12 AM

Bigg Boss 10 Telugu Day 69 Highlights

బిగ్‌బాస్ 10 హౌస్‌లో ఈ వారమంతా ఫ్యామిలీ వీక్ నడిచింది. మరోవైపు కొత్త కెప్టెన్‌గా నరేశ్ ఎంపికయ్యాడు. ఇంతకీ 10వ సీజన్‌లో 69వ రోజైన శనివారం(నవంబర్ 14) అసలేం జరిగింది? ఎలిమినేషన్ ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'కోర్ట్' శ్రీదేవి రొమాంటిక్ సినిమా)

వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. పోటీలో ఉన్న నలుగురిలో ఎవరు కెప్టెన్ కావాలనుకుంటున్నారో వాళ్లకు 'CAPTAIN' అనే పదంలోని ఒక్కో లెటర్ వేసి కారణం చెప్పాల్సి ఉంటుందని హౌస్ మెంబర్స్‌కి చెప్పాడు. ముకేశ్ – నరేశ్‌కి, శివ్ – అమన్‌కి, రాంప్రసాద్ – నరేశ్‌కి, వర్షిణి – అమన్‌కి, నీతూ – అమన్‌కి, దేబ్జానీ – నరేశ్‌కి, శ్వేత– అమన్‌కి, సుధీర్ – నరేశ్‌కి, త్రిగున్ – నరేశ్‌కి సపోర్ట్ చేశారు. నరేశ్‌కి ఎక్కువ లెటర్స్ రావడంతో మిగిలిన లెటర్స్ తననే పెట్టుకోమని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఈ వారం కొత్త కెప్టెన్‌గా నరేశ్ ఎంపికయ్యాడు. కొత్త కెప్టెన్‌కి గోల్డ్ కాయిన్స్ ఇవ్వగా వాటిని నరేశ్.. రాంప్రసాద్, వంశీకి ఇచ్చాడు.

కాసేపటి తర్వాత ఐ యాం సారీ, ఐ యాం నాట్ సారీ అనే టాస్క్ పెట్టారు. పది వారాల జర్నీలో మీరు బాగా హర్ట్ అయిన సంఘటన, హర్ట్ చేసిన పర్సన్ గురించి చెప్తే వాళ్ళు దానికి సమాధానం చెప్పి ఐ యాం సారీ, ఐ యాం నాట్ సారీలలో ఏదో ఒకటి చెప్పాలని నాగ్ చెప్పాడు. వర్షిణి – త్రిగుణ్ పేరు చెప్పింది. నామినేషన్స్‌లో త్రిగుణ్ మాట్లాడినందుకు ఏడ్చి, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యానని చెప్పింది. దాంతో వర్షిణికి ఐ యాం సారీ చెప్పిన త్రిగుణ్.. తన వెర్షన్ చెప్పాడు. శ్వేత, రాంప్రసాద్ పేరు చెప్పింది కానీ నాగ్ వీడియో చూపించడంతో ఐ యాం నాట్ సారీ అని రాంప్రసాద్ చెప్పాడు. నీతూ – వంశీ పేరు చెప్పి.. నామినేషన్స్‌లో తిట్టిన మాటలకు బాధపడ్డానని కారణం చెప్పింది. వంశీ సారీ చెప్పాడు.

ముకేశ్.. తనకు బాధపడ్డ సంఘటనలు లేవన్నాడు. శివ్.. ముకేశ్ పేరు చెప్పి పర్సనల్ లైఫ్, క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు అన్నాడు. ముకేశ్ సారీ చెప్పాడు. నరేశ్– త్రిగుణ్ పేరు చెప్పి గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో అతడివల్ల తనకు నష్టం జరిగిందని హర్ట్ అయ్యానని అన్నాడు. దీంతో త్రిగుణ్ సారీ చెప్పాడు. అమన్ కూడా ఇతడి పేరు చెప్పడంతో త్రిగుణ్ సారీ చెప్పాడు. తర్వాత సుధీర్, ముకేశ్ పేరు.. వంశీ – నీతూ పేరు.. రాంప్రసాద్ – వర్షిణి పేరు.. దేబ్జానీ – రాంప్రసాద్ పేరు.. త్రిగుణ్ – వర్షిణి పేరు.. రామకృష్ణ – నరేశ్ పేరు చెప్పి సారీలు చెప్పుకొన్నారు.

తర్వాత జీరో అని రాసి ఉన్న మెడల్స్ తెచ్చి.. హౌస్‌లో జీరో గేమర్ ఎవరు? ఏం ఆడట్లేదు, జీరోగానే ఉన్నారు అనేది ఎవరికీ సెట్ అవుతుందో వాళ్ల మెడలో ఈ ట్యాగ్ వేసి కారణాలు చెప్పాలని నాగార్జున అన్నారు. రాంప్రసాద్ – వర్షిణికి.. వంశీ – వర్షిణికి, శ్వేత – వర్షిణికి, అమన్ – సుధీర్‌కి, ముకేశ్ – సుధీర్‌కి, రామకృష్ణ – శ్వేతకి, శివ్ – త్రిగుణ్‌కి.. నీతూ – త్రిగుణ్‌కి వేశారు. దేబ్జానీ – సుధీర్‌కి, నరేశ్ – నీతూకి, వర్షిణి – శివ్‌కి, సుధీర్ – రామకృష్ణకి, త్రిగుణ్ – శివ్‌కి జీరో మెడల్స్ ఇచ్చారు. వర్షిణి – సుధీర్‌కి టై కాగా హౌస్‌మేట్స్ వర్షిణిని ఎంచుకున్నారు. దీంతో రెడ్ పిల్, బ్లూ పిల్ అని ఇచ్చి ఒకటి ఎంచుకోమని చెప్పగా బ్లూ పిల్ తీసుకుంది. అందులో ఈ సీజన్‌లో నో కెప్టెన్ అని పనిష్మెంట్ ఉంది. అంటే వర్షిణి ఇకపై కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ లేదని నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.  

అయితే ఈ వారం వర్షిణి, రామకృష్ణ ఫ్యామిలీస్ తప్పితే మిగిలిన వాళ్లందరివీ వచ్చాయి. దీంతో ఓ అవకాశం ఇస్తున్నానని చెప్పిన నాగార్జున.. ఒక్కరికే ఛాన్స్, ఎవరి ఫ్యామిలీ రావాలో కంటెస్టెంట్స్ డిసైడ్ చేయాలి. రీజన్ చెప్పి వాళ్లకు ఓటు వేయాలని ఓ టాస్క్ పెట్టాడు. చివరకు వర్షిణికి ఏడు ఓట్లు, రామకృష్ణకు నాలుగు ఓట్లు పడ్డాయి. దీంతో వర్షిణి అమ్మ ఇంట్లోకి వస్తారని, రామకృష్ణ మాత్రం బయట నుంచి వీడియోలో మాట్లాడతారని నాగార్జున చెప్పాడు. వర్షిణితో పాటు ముకేశ్, త్రిగుణ్ కూడా కూర్చొని వర్షిణి తల్లితో మాట్లాడారు. చివరి వరకు మా అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆడు అని ముకేశ్‌తో వర్షిణి తల్లి చెప్పింది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది.

(ఇదీ చదవండి: విడాకులు తీసుకోలేదు.. కానీ విడివిడిగా ఉంటున్నాం: రమ్యకృష్ణ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement