వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్! | IAF Pilot who Built Rs 1,670 Crore Company: Injury ended his flying career | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..

Jan 27 2026 12:38 PM | Updated on Jan 27 2026 1:13 PM

IAF Pilot who Built Rs 1,670 Crore Company: Injury ended his flying career

ఒకప్పుడు అనంతమైన ఆకాశంలో విహరించడమే అతడి జీవితం. వైమానికదళంలో హెలికాప్టర్‌ పైలట్‌గా రెస్క్యూ మిషన్ల ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించాడు. పలు తుఫానుల నుంచి ఎన్నో ప్రాణాలను రక్షించి సాహసవంతమైన పైలట్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ జీవితంలో ఎదురైన ప్రమాదం అనే తుఫాను కుదుపు అమాంతం రెక్కలు విరిచి ఆకాశం నుంచి నేలపై పడేసింది. భవిష్యత్తు లేదనేలా కుప్పకూలిపోయిన జీవితాన్ని మళ్లీ గాడీలో  పెట్టి..వ్యాపార పుస్తకాలు కుస్తీ పట్టాడు. ఇవాళ కోట్లు టర్నోవర్‌ చేసే కంపెనీని నిర్మించి ఎప్పటికీ నా గమ్యం ఆకామంతే అని చాటిచెప్పి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎవరా వ్యక్తి..? ఏమా కథ..? చకచక చదివేయండి..

అతడే విజయ అరిసెట్టి. ఆకాశమే తన ప్రపంచంగా సాగిపోయింది అతడి జీవితం. భారత వైమానికదళంలో హెలికాప్టర్‌ పైలట్‌గా విజయ్‌ అరిసెట్టి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లకు బాధ్యత వహించాడు. ప్రాణాలను కాపాడటం అనే స్పష్టమైన లక్ష్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. అంతేగాదు 2004 సునామీ సమయంలో అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులలో ఉగ్రమైన నీటి నుంచి వందలాది మందిని అసామాన్య ధైర్యసాహసాలతో రక్షించి శౌర్య చక్రాని అందుకున్నాడు. 

ఎందరి ప్రాణాలను ప్రాణాలకు తెగించి కాపాడితే చిన్నపాటి క్రీడా గాయం జీవితాన్ని ఒక్కసారిగా నేలమట్టం చేసింది. ఆ విషాదకరమైన ప్రమాదం..అతడి జీవితం ఎప్పటికీ భూమీదనే అన్నట్లుగా విధి కన్నెర్రజేసింది. తనకు భవిష్యత్తు ఏంలేదు అన్నట్లు ఉన్న తన లైఫ్‌ని మళ్లీ పట్టాలెక్కించి..విధినే వెక్కిరించాలని అనుకున్నాడు. మళ్లీ విద్యార్థిలా వ్యాపార పుస్తకాలు కుస్తీ పట్టేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చేరాడు. 

అలా కార్పొరేట్‌ ప్రపంచంలో ఎదుగుతూ గోల్డ్‌మన్‌ సాచ్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు. కానీ మనసులో ఏదో అసంతృప్తి ప్రాణాదాతకు..రక్షణ బాధ్యత నచ్చినంతగా..ఎత్తులకు పైఎత్తుల వేస్తూ ముందుకుసాగే కార్పొరేట్‌ లైఫ్‌ అస్సలు రుచించలేదు. మళ్లీ రక్షణ బాధ్యతకు సంబంధించిన అవకాశాన్నే వెతుక్కుంటూ గ్రేటెడ్ అపార్ట్‌మెంట్లలో అభద్రతతో బతుకుతున్న వృద్ధులు, చిన్నపిల్లల బాధలను కళ్లారా చూశాడు. 

టైంకి డెలవరీ కానీ ఐటెమ్స్‌తో గందరగోళానికి గురవ్వుతున్న సెక్యూరిటీ గార్డుల తిప్పలు కళ్లారా చూసి..వీరందరి మధ్య కమ్యునికేషన్‌ డిస్‌కనెక్ట్‌ కాకుండా ఉండేలా మెరుగైన భద్రతా కోసం అన్వేషించాడు. ఆ క్రమంలో తన మిత్రులు అభిషేక్‌ కుమార్‌, శ్రేయాన్స్‌ డాగాతో కలిసి మైగేట్‌ అనే కంపెనీని స్థాపించాడు. అతడి చొరవతో సాంకేతిక సాయంతో అపార్ట్‌మెంట్‌ గేట్‌ను స్మార్ట్‌గా, సురక్షితమైన కమాండ్‌ సెంటర్‌గా మార్చాడు. 

మైగేట్ యాప్ నివాసితులు, సెక్యూరిటీ గార్డులు, సొసైటీ నిర్వహణను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కలుపుతుంది. ఇది ప్రతి సందర్శకుడిని ధృవీకరిస్తుంది, ప్రతి డెలివరీని ట్రాక్ చేస్తుంది. అలాగే ప్రతి అత్యవసర హెచరికను తక్షణమే చేరవేస్తుంది ఈ యాప్‌. విజయ్ తన సైనిక అనుభవంతో ఖచ్చితత్వం, వ్యూహాత్మక వ్యాపార ఆలోచన, సేవ చేయాలనే ప్రగాఢ కోరిక తదితరాలన్నింటిని ఒకే వెంచర్‌లో కలిపాడు. అతను కేవలం ఒక యాప్‌ని నిర్మించ లేదు. ఆధునిక పట్టణ కుటుంబాలకు మనశ్శాంతిని, భద్రత అందేలా చేస్తున్నాడు ఈ యాప్‌తో. 

ప్రస్తుతం ఈ మైగేట్‌ యాప్‌ సుమారు 40 లక్షలకు పైగా ఇళ్లను రక్షిస్తోంది. ఒక గ్రౌండెడ్ పైలట్ దార్శనికత నుంచి పుట్టిన ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ. 1,670 కోట్లు పైనే. ఇక్కడ విజయ అరిశెట్టి సక్సెస్‌ జర్నీ జీవితంలో ఎదురుదెబ్బలనేవి అత్యంత సాధారణం అని, వాటిని తట్టుకుని నిలబడటంలోనే మజా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అంతేగాదు ఒక రక్షకుడు ఎల్లప్పుడూ రక్షకుడిగానే ఉంటాడనేందు ఈ మాజీ పైలట్‌ కథే నిదర్శనం. 

(చదవండి: 'చల్లటి ఫలుడా'ని ఆస్వాదిస్తున్న సునీతా విలియమ్స్‌..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement