ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ | Director Ram Gopal Varma Advices To Dog Lovers, Here's The List Of Solutions He Gave To Dog Lovers | Sakshi
Sakshi News home page

శునకాల కోసం స్కూల్స్‌, పిల్లల కోసం బోన్లు నిర్మించండి: డాగ్‌ లవర్స్‌పై ఆర్జీవీ ఫైర్‌

Aug 17 2025 12:39 PM | Updated on Aug 17 2025 1:39 PM

Director Ram Gopal Varma Advices to Dog Lovers

ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్‌ సదా, జాన్వీ కపూర్‌, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.

కుక్క కోసం కన్నీళ్లా?
సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్‌ ట్వీట్‌ చేశాడు.

🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.
🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!
🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్‌ చేసుకుంటే సరిపోతుందిగా!
🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.
🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్‌ డాగ్స్‌ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.

🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్‌ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.
🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.
🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.
🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.
🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్‌ ప్రారంభించండి.
🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్‌ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.
🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి.

 

చదవండి: అఖిల్‌ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement