
మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన "సికందర్" చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అభిమానులు కూడా ఈ చిత్రంపై విమర్శలు చేశారు. సికందర్ స్క్రిప్ట్ విషయంలో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ సినిమా వైఫల్యానికి కారణం తాను కాదంటూ మురుగదాస్ తాజాగా చెప్పుకొచ్చారు. సుమారు సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ. 170 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు బాలీవుడ్ పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. సాజిద్ నదియాద్వాలా ఈ మూవీని నిర్మించారు.
సికందర్ సినిమా వైఫల్యానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్ అనే అర్థం వచ్చేలా మురుగదాస్ చెప్పుకొచ్చాడు. 'ఈ కథ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నేను బాగా తెరకెక్కించలేకపోయాను. కానీ, దానికి నేను మాత్రమే బాధ్యత వహించను. గజిని రీమేక్ అయినప్పటికీ బాగా ఆడింది. సికందర్ స్ట్రెయిట్ సినిమా.. అక్కడ నాకు కమాండింగ్ యూనిట్ లేదు. నేను అనుకున్న కథను మార్చేశారు. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాను. కాబట్టి సికందర్ వైఫల్యానికి నేను బాధ్యత వహించను.' అని ఆయన పేర్కొన్నారు.
టాలీవుడ్‌పై పరోక్ష వ్యాఖ్యలు
ఇదే ఇంటర్వ్యూలో మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలామంది దర్శకులు రూ. 1000 కోట్ల సినిమాలు తీస్తున్నారు. వాళ్లు తీసే సినిమాలు కేవలం జనాలకు కనువిందు చేసేలా ఉంటాయి. కానీ, తమిళ దర్శకులు తీసే సినిమాలు ప్రజలను ప్రభావితం చేసేలా ఉంటాయి. మేము సామాజిక కోణంలో సినిమాలు చేస్తాం. ప్రజలను ఆలోచింపచేసే సినిమాలు చేస్తాం.' అంటూ ఆయన కామెంట్లు చేశారు.
#ARMurugadoss about #Sikandar Failure. So #SalmanKhan was the reason behind failure👀pic.twitter.com/oIywwHRrX6
"Sikandar Base story was very close to my heart. But i couldn't able to execute well. But I'm not the only one who is responsible for it. Ghajini is remake but it's…— AmuthaBharathi (@CinemaWithAB) August 16, 2025