
టాలీవుడ్ దర్శకుడు తేజ ఎన్నో ప్రేమ కథలను వెండితెరపై చూపించాడు. చిత్రం, నువ్వూ-నేను, జయం వంటి చిత్రాలతో పాటు నేనే రాజు-నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామా కథను కూడా చూపించాడు. అయితే, కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. సరైన కథతో భారీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయాలని, అది కూడా ఒక ప్రేమకథతో బాక్సాఫీస్ వద్దకు రావాలని ఆయన చూస్తున్నారు. ఈమేరకు షోషల్‌మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది.

సుమారు రెండేళ్ల క్రితం పిరియాడిల్ ఎపిక్ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. ఇదే చిత్రంతో తన కుమారుడు అమితవ్‌ను చిత్రపరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. లక్ష్మి నరసింహా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా గతంలోనే విడుదల చేశారు. 18వ శతాబ్దం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ‘విక్రమాదిత్య’ అనే పిరియాడికల్ లవ్‌స్టోరితో తేజ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజుల ఆగాల్సిందే. కాగా త్వరలోనే ‘విక్రమాదిత్య’ను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్‌గా సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు
ఇదే ప్రాజెక్ట్‌తో సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, రమేష్‌బాబు కుమార్తె అయిన భారతిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం కానున్నట్లు షోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొంత సమయం పాటు వేచి ఉండాల్సిందే.