ట్రైలర్‌ చూశాక ఈర్ష్య కలిగింది | Priyadarshi Speech At 23 Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూశాక ఈర్ష్య కలిగింది

May 8 2025 5:49 AM | Updated on May 8 2025 5:49 AM

Priyadarshi Speech At 23 Movie Trailer Launch Event

– ప్రియదర్శి  

‘‘రాజ్‌గారు ‘23’ సినిమా చేయమని నా దగ్గరికి వచ్చారు. వేరే ప్రాజెక్ట్స్‌ వల్ల చేయడం కుదరలేదు. ఈ కథ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా... గొప్ప సినిమా ఇది. రాజుగారు లాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ ఉండడం తెలుగు సినిమా అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రం ట్రైలర్‌ చూశాక నేను చేసుంటే బాగుండేదనే చిన్న ఈర‡్ష్య కలిగింది. ఇలాంటి సినిమాని తప్పకుండా ప్రేక్షకులు చూడాలి’’ అని హీరో ప్రియదర్శి కోరారు.

 తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో ‘మల్లేశం’ మూవీ ఫేమ్‌ రాజ్‌ ఆర్‌. దర్శకత్వం వహించిన చిత్రం ‘23’. స్టూడియో 99పై రూపొందిన ఈ చిత్రానికి వెంకట్‌ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమాని స్పిరిట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ చేస్తోంది. ఈ నెల 16న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘23’ ట్రైలర్‌ విడుదల వేడుకకి ప్రియదర్శి, పాటల రచయిత చంద్రబోస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 చంద్రబోస్‌ మాట్లాడుతూ– ‘‘రాజ్‌గారు నిజాయితీ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమాలో మూడు మంచి పాటలు రాసే అవకాశం దొరికింది. ‘మల్లేశం’ ప్రియదర్శికి నటుడిగా ఎలా జన్మనిచ్చిందో అలా ‘23’ నటీనటులందరికీ కొత్త జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమాల్లో మాది చాలా పెద్ద సినిమా. థియేటర్స్‌లోనే చూడండి. అప్పుడే థియేటర్స్‌ సంస్కృతి బాగుంటుంది. మా ‘23’లాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని వినతి చేశాను’’ అని రాజ్‌ రాచకొండ తెలిపారు. ఈ వేడుకలో నటీనటులు తన్మయి, తేజ, పవన్‌ రమేశ్, ప్రణీత్‌ మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement