tanmayi
-
ట్రైలర్ చూశాక ఈర్ష్య కలిగింది
‘‘రాజ్‌గారు ‘23’ సినిమా చేయమని నా దగ్గరికి వచ్చారు. వేరే ప్రాజెక్ట్స్ వల్ల చేయడం కుదరలేదు. ఈ కథ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా... గొప్ప సినిమా ఇది. రాజుగారు లాంటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉండడం తెలుగు సినిమా అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రం ట్రైలర్ చూశాక నేను చేసుంటే బాగుండేదనే చిన్న ఈర‡్ష్య కలిగింది. ఇలాంటి సినిమాని తప్పకుండా ప్రేక్షకులు చూడాలి’’ అని హీరో ప్రియదర్శి కోరారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో ‘మల్లేశం’ మూవీ ఫేమ్ రాజ్ ఆర్. దర్శకత్వం వహించిన చిత్రం ‘23’. స్టూడియో 99పై రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ నెల 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘23’ ట్రైలర్ విడుదల వేడుకకి ప్రియదర్శి, పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘రాజ్‌గారు నిజాయితీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో మూడు మంచి పాటలు రాసే అవకాశం దొరికింది. ‘మల్లేశం’ ప్రియదర్శికి నటుడిగా ఎలా జన్మనిచ్చిందో అలా ‘23’ నటీనటులందరికీ కొత్త జన్మ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చిన్న సినిమాల్లో మాది చాలా పెద్ద సినిమా. థియేటర్స్‌లోనే చూడండి. అప్పుడే థియేటర్స్ సంస్కృతి బాగుంటుంది. మా ‘23’లాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని వినతి చేశాను’’ అని రాజ్ రాచకొండ తెలిపారు. ఈ వేడుకలో నటీనటులు తన్మయి, తేజ, పవన్ రమేశ్, ప్రణీత్ మాట్లాడారు. -
'అందరూ ఫేక్.. కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో తన్మయ్ ఒకరు. లేడీ గెటప్స్‌లో జబర్దస్త్ షో మాత్రమే కాకుండా పలు షోల్లో కనిపించింది. అయితే ఊహించని విధంగా జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసి ఓ టీవీ షోలో కనిపించింది. అయితే కొన్ని రోజులకు ఆ షో ఆగిపోవడంతో జబర్దస్త్‌లో రీఎంట్రీ ఇచ్చింది. రాకింగ్ రాకేష్, చలాకీ చంటి టీమ్స్‌లో లేడీ గెటప్‌లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన్మయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో పడిన కష్టాలను తలచుకుని ఎమోషనలైంది తన్మయ్. నా జీవితంలో చాలా మంది తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన్మయ్ మాట్లాడుతూ..' నన్ను మోసం చేయని వారంటూ లేరు. స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్లు కూడా చీట్ చేశారు. ఇండస్ట్రీ వాళ్లతో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించారు. ఒక పెద్ద పేరున్న వ్యక్తే. మా జబర్దస్త్‌లోనే కొంతమంది నన్ను మోసం చేశారు. స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా చీట్ చేశారు. వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకడు. అతన్ని నేను లైఫ్‌లో మర్చిపోను. నేను జబర్దస్త్ మానేసి అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. అతన్ని ఒక టైమ్‌లో నా సొంత అన్నలా ట్రీట్ చేశా. కానీ అతని మైండ్ సెంట్ అంతా వేరు. కానీ నా పర్సనల్ విషయాల్లో అతని వల్ల చాలా బాధపడ్డా. ఒకానొక టైమ్‌లో తనకి నేను చాలా సపోర్ట్ చేశా. కానీ అతని వల్లే నేను జబర్దస్త్ నుంచి బయటికొచ్చేశా. ఫైనాన్షియల్‌గా అతని సపోర్ట్ చేశా. కానీ నాకు ఎలాంటి సాయం చేయలేదు. ఈ ప్రపంచంలో నాశనం చేసేది డబ్బు, నమ్మకం ఈ రెండే. మనకు సాయం చేశారన్న విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఎంత చేశానన్నది కిర్రాక్ ఆర్పీకి తెలుసు. చాలా మంది జబర్దస్త్ వాళ్లకి తెలుసు. ఈ రోజుల్లో డబ్బు మీదే అంతా నడుస్తోంది. ఒక మనిషిని బాగుపడాలన్నా డబ్బు, నమ్మకమే.. చెడిపోవాలన్నా డబ్బు, నమ్మకమే. కానీ మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నది మనకు మాత్రమే తెలుసు. అందరికీ నా డబ్బు, బాడీ, ఫేమ్ మాత్రమే కావాలి' అని ఆవేదన వ్యక్తం చేసింది.(ఇది చదవండి: 'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!)నాకంటూ నేను పర్సనల్‌గా ఏమీ దాచుకోలేదని తన్మయ్ తెలిపింది. మా నాన్న చనిపోయినప్పుడు నూక రాజు తనకు అండగా నిలిచారని చెప్పింది. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లే వరకు తనతో పాటే ఉన్నాడని పేర్కొంది. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నాకు తపన ఉండేదని తెలిపింది. నా జీవితంలో మా అన్నయ్య నాకు చాలా అండగా నిలిచాడని తన్మయ్ చెప్పుకొచ్చింది. నా కోసం తను చాలా కష్టపడ్డాడని తన్మయ్ ఎమోషనల్ అయింది.జబర్దస్త్ గురించి మాట్లాడుతూ..'నా జీవితంలో ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నది లేదు. జబర్దస్త్ వల్ల కొంచం పేరు వచ్చింది. గుంటూరులో ఒక మంచి ఇల్లు కట్టుకున్నా. ఫ్యామిలీని బాగా చూసుకున్నా. కానీ వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డా. అసలు ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. ఒక ప్రేమ లేదు, కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. బయట కూడా ఎవరూ సాయం చేయలేజు. ఎక్కడ చూసిన ఫేక్ అంతా.. నమ్మి మోసం పోవడం తప్ప చేసేదేం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు!
ప్రతిభా కిరణం ఇది పోటీ ప్రపంచం. ఈ యుగంలో పోటీ పడనిదే పనిజరగదు. అని తన్మయి గ్రహించింది కాబోలు, పోటీలలో పాల్గొనడమే ధ్యేయంగా పెట్టుకుంది. పాల్గొన్న ప్రతిదానిలోనూ గెలిచి శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 18, 1998న పుట్టిన తన్మయి అంబటి అత్యధిక పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తన్మయి వివిధ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పరీక్షలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్లే మాడలింగ్, చేతి రాత, పర్యావరణ అవగాహన, సామాజిక సేవ మొదలైన అంశాలలో 151కి పైగా అవార్డులను అందుకుంది. అంతర్జాతీయ మేథమెటిక్స్ ఒలంపియాడ్, జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా స్పాట్ కేమెల్ కలర్ కాంటెస్ట్, ఇంట్రా స్కూల్ లెవెల్ సైన్స్ క్విజ్ కాంటెస్ట్‌లతో పాటు ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన మేథమెటిక్స్, కంప్యూటర్ పరీక్షలలో బంగారు పతకాలు సాధించింది. ఆమె తొమ్మిది ఏళ్ల వయసులో కళారత్న, బాలమేధావి అనే బిరుదులను సంపాదించింది. 10 జూన్, 2010లో ‘మహా స్టార్’ గా ఎన్నికైనందుకు ప్రముఖ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఇంకా ఆంధ్రబాలరత్న, స్టేట్ బెస్ట్ చైల్డ్, జూనియర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు పొందింది. అంతేకాదు, మన దేశ మాజీ రాష్ర్టపతి శ్రీమతి ప్రతిభాపాటిల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయల అభినందనలు కూడా అందుకుంది తన్మయి. ఈ బాలికని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పోటీలలో పాల్గొనండి, పతకాల పంట పండించండి!