ఈ కథ మూలాలు  ప్రతి ఇంట్లో ఉంటాయి  – ప్రియదర్శి | Priyadarshi and Naga Durga Idupu Kayitham First Look launch | Sakshi
Sakshi News home page

ఈ కథ మూలాలు  ప్రతి ఇంట్లో ఉంటాయి  – ప్రియదర్శి

Jun 26 2026 5:32 AM | Updated on Jun 26 2026 5:32 AM

Priyadarshi and Naga Durga Idupu Kayitham First Look launch

ప్రియదర్శి, నాగదుర్గ (తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో బన్నీ వాసు వర్క్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై బన్నీ వాసు, సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తమిళ దర్శక–నిర్మాత, నటుడు లోకేష్‌ కనగరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరై, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. 

తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో శ్రీనివాస్‌ అనే పాత్ర చేస్తున్నాను. తెలంగాణ నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు. కానీ ఇదొక గ్లోబల్‌ అని గర్వంగా చెప్పగలను. ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి’’ అన్నారు. ‘‘నేను పక్కా తెలంగాణ అమ్మాయిని. ఈ కథ విన్నప్పుడు బాల్యంలోకి వెళ్లిపోయాను. 

మనం ఈ సినిమా చేస్తున్నాం అని సుక్కుకు చె΄్పాను. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌లో ఇదొక మైల్‌స్టోన్‌ మూవీ’’ అన్నారు నిర్మాత తబిత సుకుమార్‌. ‘‘ఈ కథ చెప్పగానే నమ్మి, సినిమా చేస్తున్నామని చెప్పిన మా ఆడబిడ్డ తబితగారితో పాటు సుకుమార్, బన్నీ వాసు, దర్శి, బూసం జగన్మోహన్‌ రెడ్డిగార్లకు, వేణు ఊడుగుల, పూజారి నాగేశ్వరరావులకు థ్యాంక్స్‌’’ అన్నారు వంశీకృష్ణ. 

‘‘ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక అమ్మాయి అయితే... వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్‌కి వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అబ్బాయి అయితే అత్తామామను తీసుకుని విడిగా థియేటర్‌కు వెళ్లండి. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు’’ అన్నారు బన్నీ వాసు. ‘‘యూట్యూబ్‌లో నా పాటలు చూసి, విని ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను. ఇందులో నేను చేస్తున్న శ్రీలత పాత్ర చాలా బరువైనది’’ అన్నారు నాగదుర్గ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement