అర్జున్ దాస్, శాండీ మాస్టర్, తేజు అశ్విని నటించిన చిత్రం ‘సూపర్ హీరో బాబు’ (తమిళంలో ‘సూపర్ హీరో’). విఘ్నేష్ వేణుగోపాల్ దర్శకత్వంలో నిర్మాత కె.ఎస్. సినిష్ సోల్జర్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ సమర్పణలో శంజన్ .జి నిర్మించారు.
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందించిన చిత్రం ‘సూపర్ హీరో బాబు’. అర్జున్ దాస్, తేజు అశ్విని మధ్య వచ్చే సన్నివేశాలు, శాండీ, అర్జున్ దాస్‌ల సీన్స్ ఆకర్షణగా నిలుస్తాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్ పేర్కొంది.


