సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్ | Yogi Babu Surprises Fans With Emotional Gesture, Done Con City Movie For Half Remuneration | Sakshi
Sakshi News home page

సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్

Jun 22 2026 8:35 AM | Updated on Jun 22 2026 11:37 AM

Yogi Babu Done Con City Movie For Half Remuneration

సాధారణంగా నటీనటులు ఎవరైనా సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. కానీ కొన్నిసార్లు మాత్రం పారితోషికం తగ్గించుకోవడం లాంటివి చేస్తుంటారు. తాజాగా స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా వరస సినిమాలు చేస్తున్నప్పటికీ ఓ మూవీకి మాత్రం సగం రెమ్యునరేషన్ తీసుకుని చేశాడు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌ని పవన్ పక్కనబెట్టేశారా?)

నటుడు ఆర్జున్‌దాస్‌, అన్నాబెన్‌ జంటగా నటించిన చిత్రం కాన్‌సిటీ. యోగిబాబు, వీటీవీ.గణేశ్‌ తదితరులు ఇతర పాత్రలు చేశారు. హరీష్‌ దురైరాజ్‌ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఈ శుక్రవారమే(జూన్ 26) తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన యోగిబాబు.. దర్శకుడు హరీష్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, ఆయన శ్రమ, అంకితభావం చూసి తను దర్శకుడు కావాలనేది తన కోరిక అని చెప్పారు.

దర్శకుడు హరీష్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా దర్శకుడిని కావాలని అనుకున్నానని, దర్శకుడిగా అవకాశం రాగానే ఇందులో యోగిబాబును నటింపజేయాలని అనుకున్నానని.. ఆయన సగం పారితోషికంతోనే ఇందులో నటించినట్లు చెప్పారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement