'ఓజీ 2' అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌ని పవన్ పక్కనబెట్టేశారా? | Pawan Kalyan OG 2 On Cards? Director Sujeeth Meets Pawan, Check Out Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

OG 2 Movie: సుజీత్-పవన్ మీటింగ్.. 'ఓజీ 2' అప్‌డేట్

Jun 21 2026 7:28 PM | Updated on Jun 22 2026 9:37 AM

Pawan Kalyan OG 2 Movie Latest Update

రీఎంట్రీలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు పవన్ చేసినప్పటికీ.. అవి అభిమానులకు తప్పితే మిగతా వాళ్లకు పెద్దగా నచ్చలేదు. తర్వాత చేసిన వాటిలో బ్రో, హరిహర వీరమల్లు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి టైంలో 'ఓజీ' హిట్ కావడంతో పవన్‌లో కాస్త జోష్ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజ్ కాగా ఆ టైంలో దీని సీక్వెల్‌పై టాక్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ విషయమై అప్‌డేట్ వచ్చేసింది.

(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)

'ఓజీ' తీసిన దర్శకుడు సుజీత్.. మళ్లీ పవన్ కల్యాణ్‌ని కలిశాడు. ఈ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయి. చూస్తుంటే త్వరలోనే షూటింగ్ మొదలయ్యేలా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ పవన్ కల్యాణ్‌తో కొన్నాళ్ల క్రితం సురేందర్ రెడ్డి ఓ మూవీ మొదలుపెట్టారు. అప్పటినుంచి ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. అయితే అది షూటింగ్ జరుగుతుందా? లేదంటే 'ఓజీ 2' కోసం పవన్.. సురేందర్ రెడ్డిని పక్కనబెట్టేశాడా అని సందేహాలు వస్తున్నాయి.

మరోవైపు సుజీత్ కూడా నానితో 'బ్లడీ రోమియో' అనే సినిమా చేయాలి. ఈ మూవీ లొకేషన్స్ కోసమే రీసెంట్‌గా సుజీత్.. ఇంగ్లాండ్ వెళ్లొచ్చాడనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ దర్శకుడు పవన్‌ని కలవడం చూస్తే నాని మూవీ మొదలవడానికి ముందే 'ఓజీ 2' చేస్తారా అనిపిస్తుంది. ఈ సందేహాలన్నింటికి త్వరలో సమాధానమిస్తారేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఎట్టకేలకు 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement