ఎట్టకేలకు మూడో రిలీజ్ డేట్.. ఈసారైనా నమ్మొచ్చా? | Yash Toxic Movie New Release Date | Sakshi
Sakshi News home page

Toxic Release Date: యష్ 'టాక్సిక్'.. ఫైనల్‌గా ఓ రిలీజ్ డేట్

Jun 21 2026 6:22 PM | Updated on Jun 21 2026 6:45 PM

Yash Toxic Movie New Release Date

'కేజీఎఫ్' రెండు సినిమాల తర్వాత యష్ చేసిన మూవీ 'టాక్సిక్'. ఈ ఏడాది మార్చిలోనే థియేటర్లలోకి రావాలి కానీ షూటింగ్ సమస్యలతో వాయిదా పడింది. కట్ చేస్తే జూన్ 4న రిలీజ్ అన్నారు కానీ ఇది కూడా జరగలేదు. అయితే ఈ ఏడాది అసలు దీన్ని విడుదల చేయరని, వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. దీంతో మేలుకున్న మూవీ టీమ్.. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది.

(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే)

ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడ్డ 'టాక్సిక్'.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ రోజు బుధవారం. సాధారణంగా సినిమాల్ని శుక్రవారం విడుదల చేస్తుంటారు. మరీ కాదంటే గురువారం తీసుకొస్తుంటారు. కానీ యష్ మాత్రం కాస్త భిన్నంగా బుధవారం ఎంచుకున్నాడు. బహుశా వీకెండ్ లోపు ఎంతైతే అంత కలెక్షన్స్ రాబట్టేయాలని ప్లాన్‌ ఏమో? ఎందుకంటే పలుమార్లు వాయిదా పడటంతో ఈ మూవీపై బజ్ పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ రిలీజ్ ముంగిట ఏమైనా హైప్ తీసుకొస్తారేమో చూడాలి?

1980ల్లో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తీశారు. ఇందులో యష్ సరసన కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.. ఇలా ఐదుగురు హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ మూవీతో పాటు 'రామాయణ'లో యష్. రావణుడిగా విలన్ పాత్ర చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement