ఫాదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమకు తోచిన రీతిలో తండ్రి గురించి పోస్టులు పెడుతున్నారు. నాన్నని గుర్తుచేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?)
అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 'నా తండ్రే నా దైవం. కంటికి కనిపించే, మాట్లాడే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో సర్వస్వం ఆయనే ఇచ్చారు' అని రాసుకొచ్చాడు. తండ్రితో దిగిన ఫొటోలకు ప్రవచనకర్త చాగంటి వాయిస్ ఓవర్ జోడించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ప్రపంచంలోని తండ్రులందరికీ అల్లు అర్జున్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పాడు.
'పుష్ప' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్నాడు. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)


