పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి? | Rashmika Cocktail 2 Movie Telugu Review | Sakshi
Sakshi News home page

Rashmika Cocktail 2: గ్లామర్ చూపించేసిన రష్మిక.. బాలీవుడ్ ఏమంటోంది?

Jun 20 2026 9:06 PM | Updated on Jun 21 2026 11:03 AM

Rashmika Cocktail 2 Movie Telugu Review

ఈ వీకెండ్ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలతో వచ్చారు. మామూలుగా చెప్పుకొంటే ఇందులో అంతేం ఉందని అనిపిస్తుంది. కానీ ఈ రెండు మూవీస్ కూడా ఆయా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినవి కావడంతో కాస్త ఆసక్తి నెలకొంది. సమంత 'మా ఇంటి బంగారం' పాస్ మార్కులు వేయించుకుంది. మరి రష్మిక 'కాక్‌టెయిల్ 2' టాక్ ఏంటి? ప్రేక్షకులు ఏమంటున్నారు?

(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

రష్మిక ఇదివరకే హిందీలో గుడ్ బై, థామా, ఛావా, యానిమల్, మిషన్ మజ్ను తదితర సినిమాలు చేసింది. అయితే వీటిలో యానిమల్, ఛావా మాత్రమే మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు 'కాక్‌టెయిల్ 2'తో వచ్చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఈ మూవీకి దాదాపుగా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ స్టార్స్ ఉండటం వల్ల కలెక్షన్స్ పర్లేదనిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యే లివ్ ఇన్ రిలేషన్, గ్లామర్ లాంటివి ఉండటంతో కాస్తోకూస్తో యూత్ వస్తున్నారు. అయితే ఇది హిందీ వరకే రిలీజ్ చేశారు. సోషల్ మీడియా అంతా కూడా కృతి సనన్ సూపర్ అన్నట్లు ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో పీఆర్ చాలా ఉంటుంది. మరి నిజంగానే కృతి బాగా చేసిందా లేదంటే రష్మికని సైడ్ చేయడానికి కృతిని పొగిడేస్తున్నారా అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికైతే నెగిటివ్ టాక్ నడుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఫలితం ఏంటనేది పూర్తి క్లారిటీ రావొచ్చు.

'కాక్‌టెయిల్ 2' విషయానికొస్తే.. షాహిద్ కపూర్, రష్మిక పాత్రలు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. ఓ సందర్భంలో రష్మిక పాత్ర విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ఎంత నిజాయతీపరుడో తెలుసుకునేందుకు రష్మిక, తన ఫ్రెండ్ కృతి సనన్ సాయం అడుగుతుంది. సరదాగా పరీక్షిద్దాం అనుకుంటే మొత్తం సీన్ మారిపోతుంది. చివరకు ఏమైందో? మరి ఎవరు ఎవరు ఒక్కటయ్యారు అనేది మిగతా స్టోరీ. 

(ఇదీ చదవండి: సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement