సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి | Manoj Paramahamsa Appointed Tamilnadu Film School Chairman | Sakshi
Sakshi News home page

CM Vijay: సినిమాటోగ్రాఫర్‌కి కీలక పదవి ఇచ్చిన విజయ్

Jun 20 2026 8:35 PM | Updated on Jun 21 2026 11:03 AM

Manoj Paramahamsa Appointed Tamilnadu Film School Chairman

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. మరోవైపు వరసగా సినీ ప్రముఖులని కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈయన తీసుకున్న నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు కీలక పదవి కట్టబెట్టడమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసని తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. మనోజ్ ఒకప్పుడు ఈ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదువుకున్నారు. తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఖాళీ సమయాల్లో సినిమాటోగ్రఫీకి సంబంధించి వర్క్ షాప్స్ నిర్వహించడం, క్లాసులు చెప్పడం లాంటివి మనోజ్ పరమహంస చేస్తుంటారు. విజయ్ హీరోగా నటించిన స్నేహితుడు, లియో, బీస్ట్ సినిమాలకు ఈయనే సినిమాటోగ్రాఫర్. అలా టెక్నికల్ నాలెడ్జ్ ఉందని ఈయనకు పదవి ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విజయ్ తన సన్నిహితులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

ఇకపోతే మనోజ్ పరమహంస తెలుగులో.. రేసుగుర్రం, ఏ మాయ చేశావె, బ్రూస్ లీ, రాధేశ్యామ్, గుంటూరు కారం, హరిహర వీరమల్లు, ఓజీ తదితర సినిమాలకు పనిచేశారు. తమిళంలోనూ స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవముంది.

(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement