సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్ | Tollywood Actress Samantha Pregnant And Baby Bump Viral | Sakshi
Sakshi News home page

Samantha: బేబీ బంప్ వీడియో.. సమంత ప్రెగ్నెంట్?

Jun 20 2026 5:44 PM | Updated on Jun 20 2026 5:55 PM

Tollywood Actress Samantha Pregnant And Baby Bump Viral

హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీతో ఉందనే రూమర్స్ గత రెండు మూడు రోజుల నుంచి వచ్చాయి. అయితే 'మా ఇంటి బంగారం'తో నిన్ననే థియేటర్లలోకి వచ్చిన సామ్.. వరసగా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బేబీ బంప్‌తో కనిపించి పుకార్లని నిజం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు ‍కలెక్షన్స్ ఎన్నికోట్లు?)

చెన్నైకి చెందిన సమంత.. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉంది. మధ్యలో మయోసైటిస్ వ్యాధి వల్ల రెండేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత.. గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.

ఇప్పుడు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చింది. థియేటర్లలో దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. మూవీ సక్సెస్‌ని శనివారం టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో సమంత బేబీ బంప్‌తో కనిపించింది. ఈమె సన్నిహితులు ప్రెగ్నెన్సీ అని చెప్పారు కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. ఇదిగో రామ్ చరణ్ కూతురు క్లీంకార)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement