గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి | Actress Karishma Tanna Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Karishma Tanna: పెళ్లయిన నాలుగేళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి

Jul 29 2026 6:40 PM | Updated on Jul 29 2026 6:43 PM

Actress Karishma Tanna Blessed With Baby Boy

హిందీ ప్రముఖ సీరియల్ నటి కరిష్మా తన్నా శుభవార్త చెప్పేసింది. గురుపౌర్ణమి రోజున తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే తోటి నటీనటులు.. కరిష్మా దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈమె బయటపెట్టగా.. ఇప్పుడు బిడ్డ పుట్టాడు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌లా మిగతా హీరోలు ఎందుకు చేయలేకపోతున్నారు?)

కరిష్మా తన్నా.. 2022లో ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ వరుణ్ బంగేరాని పెళ్లి చేసుకుంది. అంతకు ముందు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అనంతరం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కరిష్మా.. 2001 నుంచి హిందీలో సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కుసుమ్' తదితర సీరియల్స్‌తో పాటు 'బిగ్ బాస్', 'నచ్ బలియే', 'జరా నచ్‌కే దిఖా' లాంటి రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఐదారేళ్లలో అయితే 'స్కూప్' లాంటి ఓటీటీ సిరీస్‌లతో ప్రశంసలు అందుకుంది. ఈమె 'సంజు', 'సూరజ్ పే మంగళ్ భారి' లాంటి సినిమాలు కూడా చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement