రష్మికతో ఐటెం సాంగ్‌.. ఆ భయంతో తీసేశారు: తమన్‌ | Lenin Team Consider Rashmika Mandanna Name For Special Song | Sakshi
Sakshi News home page

‘లెనిన్‌’లో ఐటెం సాంగ్‌.. రష్మిక, పూజాలతో ప్లాన్‌, కానీ.. : తమన్‌

Jul 29 2026 1:25 PM | Updated on Jul 29 2026 2:44 PM

Lenin Team Consider Rashmika Mandanna Name For Special Song

చాలా కాలం తర్వాత ‘లెనిన్‌’తో హిట్‌ కొట్టాడు అఖిల్‌ అక్కినేని. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించింది. తమన్‌ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ కూడా ప్లాన్‌ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ పాటని పక్కన పెట్టాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తమన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘లెనిన్‌లో ఒక ఐటం సాంగ్‌ పెట్టాలని ముందే అనుకున్నాం. అఖిల్‌ కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్‌ చేశా. రాయలసీమ యాసలో సాగే ఆ పాట..బయటకు వస్తే సూపర్‌ హిట్‌ అవుతుందని అనుకున్నా. ఈ పాట కోసం రష్మిక, పూజాహెగ్డే, కయాదు లోహర్‌ లేదా ప్రీతిముకుందన్‌లలో ఎవరినో ఒకరిని తీసుకోవాలని ప్లాన్‌ చేశారు. 

ఆ పాట బయటకు వస్తే బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. కానీ కథకి బ్రేక్‌ వేసినట్లుగా అవుతుంది. నెగెటివ్‌ రివ్యూలు వస్తాయని భయపడి చివరి నిమిషంలో దాన్ని తీసేశారు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. బాధతో నాలుగైదు వాట్సాప్‌ గ్రూపులను నుంచి వైదొలిగాను’అని తమన్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement