సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్ | Maa Inti Bangaram Movie Day 2 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaram Collection: లాభాల్లోకి సామ్ సినిమా.. 'బంగారం' వసూళ్లు ఎంతంటే?

Jun 21 2026 2:53 PM | Updated on Jun 21 2026 3:34 PM

Maa Inti Bangaram Movie Day 2 Collection Worldwide

చాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' సినిమాతో వచ్చిన సమంత.. బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తోంది. టాక్ ఓ మాదిరిగా వచ్చినప్పటికీ, స్కూల్స్ కూడా తెరిచేసినప్పటికీ ఫ్యామిలీ ఈ మూవీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదంతా కలెక్షన్స్ రూపంలో కనిపిస్తోంది. రెండు రోజుల్లో ఊహించని వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయి?

(ఇదీ చదవండి:  సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఇందులో హీరో ఎవరూ లేరు. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ భర్త రాజ్ నిడిమోరు, స్టోరీ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మంచి వసూళ్లు రాబడుతోంది. తొలిరోజు రూ.13.15 కోట్ల గ్రాస్ రాగా.. రెండు రోజులకు కలిపి రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు ఏకంగా దాదాపు రూ.15 కోట్లు వచ్చినట్లే.

ఈ నంబర్స్ బట్టి సమంత సినిమా.. తొలి రెండు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఈ సినిమా సక్సెస్ అవడంతో పాటు సమంత జీవితంలోనూ మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెన్సీతో ఉంది. శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్‌లో బేబీ బంప్‌తో కనిపించింది. ఈ ఏడాది డిసెంబరులోనే బిడ్డకు జన్మనివ్వబోతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత పెళ్లి చేసుకుంది.

(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement