సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి | Raj Nidimoro Sister Sheetal About Samantha Latest Post | Sakshi
Sakshi News home page

Samantha: ఆ రోజు రాత్రంతా సమంత నిద్రపోలేదు

Jun 21 2026 5:33 PM | Updated on Jun 21 2026 5:37 PM

Raj Nidimoro Sister Sheetal About Samantha Latest Post

హీరోయిన్ సమంత గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. తాజాగా 'మా ఇంటి బంగారం' సినిమాతో చాన్నాళ్ల తర్వాత వచ్చి సక్సెస్ అందుకుంది. అయితే సమంత ఓ రోజు రాత్రంతా నిద్రపోకుండా తనకు ఎలాంటి సపర్యాలు చేసిందో రాజ్ సోదరి శీతల్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: సమంత రచ్చ.. రెండు రోజుల్లోనే అన్ని కోట్ల కలెక్షన్)

'సమంత-రాజ్ పెళ్లయిన తర్వాత కొన్నిరోజుల తర్వాత వాళ్లింటికి వెళ్లాను. ఓరోజు అర్థరాత్రి వాంతులు, తలనొప్పి కారణంగా నేను మంచం కూడా దిగలేని పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ గ్రూప్‍‌లో నా గురించి మెసేజ్ పెట్టగా.. సమంత తాను వస్తున్నట్లు చెప్పింది. మందులు, నీళ్లు తీసుకుని తనే వచ్చింది. దుప్పట్లు లేకపోతే నాపై టవర్స్ కప్పింది. ఆ టైంకి సమంతకి చాలా పనులున్నాయి. ఉదయం షూటింగ్ ఉంది. కానీ రాత్రంతా నిద్రపోకుండా నా ఆరోగ్యాన్ని గమనిస్తూనే ఉంది. అందుకే ఇప్పటికీ బాధగా ఉంది'

'సమంత సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ తర్వాతి రోజు సెట్‌కి వెళ్లాను. అప్పుడు సమంత చీరలో స్టంట్స్ చేస్తూ నవ్వుతూ కనిపించింది. బ్రేక్ టైంలో నా దగ్గరికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. ఆమె ముఖంలోని ఆందోళన నాకు ఇప్పటికీ గుర్తుంది. రాత్రంతా నిద్రపోకుండా ఎలా నటిస్తోందో అనిపించింది. సినిమాలో ఆ సీన్స్ చూసినవాళ్లెవరికీ ఆమె అలసట గురించి తెలీదు. ఆ నవ్వు వెనకున్న సున్నితమైన మనసు గురించి తెలీదు' అని శీతల్ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement