‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కనీసం స్పందించరా?’ | Medico Priyanka Father Questions Government Over Daughter’s Critical Condition After Rajahmundry Car Crash, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కనీసం స్పందించరా?’

Aug 9 2026 11:29 AM | Updated on Aug 10 2026 7:36 AM

Medico Priyanka Father Venkatesh Angry On Chandrababu And Pawan

సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు  చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.

‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం  చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.

కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్‌ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్‌ (జీసీఎస్‌) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్‌ వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement