ఓటీటీలోకి మరో 'బాహుబలి'.. ఇంకెన్ని దాచారు? | Baahubali Returns, New Documentary The Torch Bearer To Stream On Netflix, Check Out Release Date Details | Sakshi
Sakshi News home page

Bahubali The Torch Bearer: సర్‌ప్రైజ్.. 'బాహుబలి' నుంచి మరొకటి

Jun 21 2026 9:06 PM | Updated on Jun 22 2026 9:21 AM

Bahubali The Torchbearer OTT Streaming Details

దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌తో పాటు టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా 'బాహుబలి'. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రెండు పార్ట్ రిలీజైంది. దాంతో ఈ ఫ్రాంచైజీ సంగతి అక్కడితో అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దీని నుంచి ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మరో 'బాహుబలి'ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: సమంత సినిమాలు ఎప్పుడూ చూడలేదు: రాజ్ సోదరి)

రెండు భాగాలుగా 'బాహుబలి'ని రిలీజ్ చేశారు. మూడో పార్ట్ వస్తుందని అంటున్నారు గానీ దీనిపై ఎవరికీ నమ్మకం లేదు. మరోవైపు ఈ రెండు పార్ట్స్ కలిపి ఎపిక్ పేరిట గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. దీనికి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు 'బాహుబలి' పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దీని ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు 'బాహుబలి: ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఇదంతా చూస్తున్న పలువురు నెటిజన్లు.. 'బాహుబలి' నుంచి ఇంకెన్ని దాచి ఉంచున్నారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలు తీసిన తర్వాత రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చేశాడు. ఆస్కార్ సాధించాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'వారణాసి' చేస్తున్నాడు. దీని నుంచి అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎదురుచూస్తుంటే 'బాహుబలి' నుంచి సర్‌ప్రైజులు రావడం చిత్రంగా ఉంది.

ఇప్పుడు రాబోయే 'బాహుబలి ద టార్చ్ బేరర్'లో ఇప్పటిదాకా చూడని మేకింగ్ ఫుటేజ్ తో పాటు ఈ ప్యాన్ ఇండియా మూవీకి చెందిన అరుదైన విశేషాలు అందులో చూపించబోతున్నారు. నిడివి తదితర వివరాలు వెల్లడించలేదు.

(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌ని పవన్ పక్కనబెట్టేశారా?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement