‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
‘‘యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రం ‘తెల్ల కాగితం’. నందు సవిరిగన ఈ చిత్రానికి లోతైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనాన్ని, మాటల్ని అందించారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినివ్వాలని రమేష్ బండ్రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: విజయ్ బుల్గానిన్.


