కొత్త కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలే తీస్తాను: నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి | Producer Maheshwar Reddy about Oh Sukumari movie | Sakshi
Sakshi News home page

కొత్త కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలే తీస్తాను: నిర్మాత మహేశ్వర్‌ రెడ్డి

Jul 12 2026 3:55 AM | Updated on Jul 12 2026 3:55 AM

Producer Maheshwar Reddy about Oh Sukumari movie

తిరువీర్, ఐశ్వర్యా రాజేష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌పై మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. శనివారం విలేకరుల సమావేశంలో మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నేను ఏ సినిమా నిర్మించినా కొత్త కాన్సెప్ట్‌తో కొత్త ప్రయత్నం చేస్తుంటాను.

నా గత చిత్రం ‘శివం భజే’లో కొత్త పాయింట్‌ ఉన్నట్లే ‘ఓ..! సుకుమారి’లోనూ కొత్త కాన్సెప్ట్‌ ఉంది. మనిషి శరీరంలో ఎలక్ట్రిక్‌ ఎనర్జీ కొంత ఉంటుంది. అయితే అది ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. ఈ అంశాన్నే ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ఈ చిత్రంలో హీరోయిన్‌ను హీరో ముట్టుకుంటే షాక్‌ కొడుతుంది. ఈ ‘షాక్‌ కొట్టడం’ కాన్సెప్ట్‌ చుట్టూ వచ్చే వినోదం, భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి.

హీరోయిన్‌ పాత్రకు ఐశ్వర్యా రాజేష్‌నే అనుకుని, ఆమె కాల్షీట్స్‌ కోసం ఎదురు చూసి మరీ ఈ సినిమా నిర్మించాం. ఆమె నటన ప్లస్‌ అవుతుంది. అలాగే తిరువీర్‌ పర్ఫార్మెన్స్‌ చాలా బాగుంటుంది. కామెడీ, ఎమోషన్, వినోదం... ఇలా అన్నీ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ..! సుకుమారి’  ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు ఈ సినిమాని బాగా తీశారు. భరత్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మా సినిమా విజయంపై నమ్మకం ఉంది. తిరువీర్, సత్యదేవ్‌తో కొత్త సినిమాలు చేయబోతున్నాను’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement