రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | OhSukumari Grand Release Worldwide on July 17th | Sakshi
Sakshi News home page

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jul 1 2026 4:23 AM | Updated on Jul 1 2026 4:23 AM

OhSukumari Grand Release Worldwide on July 17th

తిరువీర్, ఐశ్వర్యా రాజేష్‌ హీరో హీరోయిన్లుగా నటించిన విలేజ్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘ఓ..! సుకుమారి’. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్‌ టైన్మెంట్స్‌ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి ఈ చిత్రం నిర్మించారు. కాగా ఈ సినిమాను ఈ నెల 17న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గురువారం ప్రకటించారు.

‘‘మా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: భరత్‌ మంచిరాజు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement