నాగదుర్గ విచిత్రమైన లవ్ స్టోరీ.. తెలుగు ట్రైలర్ | Naga Durga Love Oh Love Movie Trailer | Sakshi
Sakshi News home page

Naga Durga: నాగదుర్గ తొలి తమిళ మూవీ.. తెలుగులోనూ

Jul 5 2026 9:09 PM | Updated on Jul 5 2026 9:09 PM

Naga Durga Love Oh Love Movie Trailer

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న నాగదుర్గ.. తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'లవ్ ఓ లవ్' పేరుతో తీసిన ఓ సినిమా చేసింది. హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరో. ఈ మూవీని ఈ శుక్రవారం(జూలై 10) తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు: నాగవంశీ)

ట్రైలర్ బట్టి చూస్తే అవంతిక(నాగదుర్గ), రఘు(పవిష్) ప్రేమించుకుంటారు. కానీ ప్రతిచిన్నదానికి రఘుతోనే అవంతిక ఖర్చు చేయిస్తూ ఉంటుంది. అలా నాలుగేళ్లు అయిపోతాయి. ఇక వల్ల కాదని ఫిక్స్ అయిన రఘు.. ఇప్పటివరకు తాను ఎలా అయితే ఖర్చు పెట్టి చూసుకున్నాడో.. తనని అవంతిక ఓ నెలలు చూస్తే చాలని అంటాడు. అప్పుడు ఏమైంది? చివరకు డబ్బు కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నారా? లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మరి నాగదుర్గ ఈ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో?

(ఇదీ చదవండి: అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement