ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు | Producer Naga Vamsi Reacts Obsession Movie | Sakshi
Sakshi News home page

Obsession-Naga Vamsi: 'అబ్సెషన్'పై నిర్మాత నాగవంశీ కాస్త భిన్నంగా

Jul 5 2026 8:45 PM | Updated on Jul 5 2026 8:45 PM

Producer Naga Vamsi Reacts Obsession Movie

రీసెంట్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఓ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అదే 'అబ్సెషన్'. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. జనాలు ఎగబడి చూశారు. అతిప్రేమ ఎంత అనర్థాలకు దారితీస్తుందనే విషయాన్ని కాస్త డిఫరెంట్‌గా ఇందులో ప్రెజెంట్ చేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ మాత్రం ఈ మూవీ గురించి భిన్నమైన కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: అవార్డులకు ఎన్నో దారులు.. చిరు వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్)

'జనాలు 'అబ్సెషన్' సినిమాని దాని టెక్నికల్ వాల్యూస్ కోసమో, కెమెరా వర్క్ కోసమో చూడలేదు. కేవలం ఆడపిల్లలోని శాడిజం చూసి ఎంజాయ్ చేయడానికే చూశారు. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి ఎవరికీ మనసు రాదు. ఒప్పుకోరు కూడా' అని నాగవంశీ చెప్పుకొచ్చారు. అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్రీ బార్కర్ అనే అమెరికన్ యూట్యూబర్ తీసిన 'అబ్సెషన్' మూవీలో పెద్దగా కథేం ఉండదు. వయసులో ఉన్న ఓ కుర్రాడు తన స్నేహితురాలిని వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. ఆమె తనని మాత్రమే ప్రేమించాలని ఓ రోజు బలంగా కోరుకుంటాడు. కట్ చేస్తే నిజంగానే ఆమె ఇతడిని పిచ్చిపిచ్చిగా లవ్ చేస్తుంది. తర్వాత ఏమైంది? ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీసిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement