అఖండ 2 సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉంటుంది. అది విన్న తర్వాత నాకు నెర్వస్‌గా అనిపించింది. ఇంతవరకు అలాంటి మాస్ సాంగ్ నేనెప్పుడు చేయలేదు. డ్యాన్స్ విషయంలో తగ్గొద్దు అనుకున్నాను. రెండు రోజుల ప్రాక్టీస్ చేసిన తర్వాత మోకాలు సహకరించలేదు. దీంతో ఫిజియోథెరపీ తీసుకొని మరీ ఆ పాట పూర్తి చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా స్టైలిష్ ఉంటుంది’ అన్నారు హీరోయిన్ సంయుక్త. నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ విరూపాక్ష తర్వాత తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను మాత్రం సెలెక్టెడ్‌గా చేస్తున్నాను. బింబిసారా, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ, ఆ తర్వాత అఖండ 2 సైన్ చేశాను. ఆ తర్వాత పూరి గారి సినిమా చేశాను.
→ బోయపాటి అఖండ 2 కథ చెప్పగానే చాలా నచ్చింది. డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పడంతో డేస్ట్ అడ్జస్ట్ చేశారు. బోయపాటి చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఊహకి మించి ఉంటుంది.
→ బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ల యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
→ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లో తీసుకెల్తాయి
→ కొత్త సినిమాల విషయాలకొస్తే.. స్వయంభులో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వానంద్ ‘ నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి పాత్ర లభించింది. దీంతో పాటు పూరీ జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నాను.


