
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ సినిమా అఖండ 2 రిలీజ్ డేట్‌ను దసరా సందర్భంగా ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. మరోవైపు నయనతార, దర్శకుడు సుందర్.సి కాంబినేషన్ సినిమా ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగులో మహాశక్తి పేరుతో విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆపై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి రాజుగారి గది-4 పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాంకర్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.