బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో యాక్షన్ మూవీ అఖండ-2. ఈ సినిమా రిలీజ్కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. అఖండకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
భారీగా ధరల పెంపు..
అఖండ-2 మూవీకి భారీగా టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో ఏకంగా రూ.75 పెంచుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టకెట్‌పై అదనంగా రూ.100 పెంపునకు అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ టికెట్ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఎన్నడూ లేనివిధంగా ప్రీమియర్ షోలకు కూడా అనుమతిలిచ్చింది. ఈ నెల 4న ప్రీమియర్ షో టికెట్ ధర ఏకంగా రూ.600లుగా నిర్ణయించింది.
ఇంత భారీ స్థాయిలో టికెట్స్ పెంచడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో భారీగా ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించకునేందుకు ఉత్తర్వులిచ్చారు. భారీగా టికెట్ ధరల పెంపుతో సినీ ప్రేక్షకుల జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తోంది.
#Akhanda2 కి అనుమతి 👍#Akhanda2Thaandavam 🔥 https://t.co/gvFHBdGH3f pic.twitter.com/GdqfNfYdwc
— Kakinada Talkies (@Kkdtalkies) December 2, 2025


