ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే | Kadapa Wife and Husband Incident | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకునేలా ప్రేరేపించింది భర్తే

Mar 16 2026 7:42 AM | Updated on Mar 16 2026 7:42 AM

Kadapa Wife and Husband Incident

రాజంపేట: ఉరి ఎలా వేసుకోవాలో చెప్పి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని వైఎస్సార్‌ కడప జిల్లా మన్నూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సీఐ లింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నందలూరుకు చెందిన రైల్వే లోకో పైలెట్‌ శ్రీరాం శ్రీనివాస్‌ 2017లో కృష్ణవేణి(30)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరు బోయనపల్లెలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉండేవారు. శ్రీరాం మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. 

ఈ క్రమంలో ఈనెల 11న కారు మరమ్మతుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శ్రీరాం శ్రీనివాస్‌ కృష్ణవేణిని బెల్టుతో కొట్టాడు. ఆమెను చనిపోవాలని తీవ్రంగా ప్రేరేపించాడు. మనోవేదనకు గురైన మృతురాలు బెడ్‌రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియపెట్టుకొని ఉరి వేసుకుంటుండగా, నిందితుడు ఆమెను కాపాడకపోగా , ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి భార్య సెల్‌ఫోన్‌లోనే వీడియో తీశాడు. 

ఉరి అలా కాదు.. కృష్ణా.. సరిగ్గా వేసుకో అంటూ వికృతంగా నవ్వుతూ పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆమె ఉరివేసుకుని మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి, మరుసటి రోజు తన తల్లిదండ్రులు వచి్చన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్‌ 108 బీఎన్‌ఎస్‌ కింద కేసుగా మార్చి నిందితుడు శ్రీరాం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement