
సల్మాన్ ఖాన్ మూవీ బజరంగీ భాయిజాన్‌లో నటించి అభిమానులను సంపాదించుకున్న నటి హర్షాలీ మల్హోత్రా. ఈ సినిమాలో మున్ని అనే పాత్రలో సినీ ప్రియులను మెప్పించింది. ముంబయికి చెందిన హర్షాలీ బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. హిందీలో పలు సీరియల్స్‌లో తన నటనతో రాణించింది. 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్ మూవీతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ సీక్వెల్‌లో నటిస్తోంది.

ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో హర్షాలీ.. జనని పాత్రలో కనిపించనుందని తెలిపారు. ఈ మేరకు హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

















